బీర్కూర్ మార్కెట్ కమిటీ పై ఉత్కంఠ..
2023లో శాసన సభ ఎన్నికలలో కష్ట పడ్డ వారికే పదవులన్న రేవంత్ రెడ్డి.
శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసి, ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో చేరిన వారికి పదవుల ఇస్తే సహించేది లేదంటున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మార్కెట్ కమిటీపై ఉత్కంఠ కొనసాగుతుంది, 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే, అనంతరం లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండా చేద్దామని ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నాయకులకు ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని, ఇస్తే సహించేది లేదని బీర్కుర్ ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు పదవులు అడిగేవారు గడిచిన లోక్సభ శాసనసభ ఎన్నికలప్పుడు వీరంతా ఏపార్టీలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పదవులు ఆశిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డ వారిని పక్కకు నెట్టి , బిఆర్ఎస్ పార్టీ మారి అధికార దాహంతో కాంగ్రెస్ లోకి వచ్చి పదవుల కొరకు మీరు పాటు పడడం సిగ్గుచేటని కాంగ్రెస్ కార్యకర్తలు దూషిస్తున్నారు. మి పదవి పాకులాటలపై ఉమ్మడి మండల ప్రజలు చికొడుతున్నారంటూ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ పార్టీలోకి రాకముందే బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి హామీ ఎప్పుడో జరిగిపోయిందని, సిఎం రేవంత్ రెడ్డి మిద తమకు నమ్మకం ఉందని, కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకె మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వస్తుందని బీర్కూర్ ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.