Site icon PRASHNA AYUDHAM

రబీ సీజన్‌లో యూరియా కోసం ప్రత్యేక మొబైల్ యాప్ 

IMG 20251220 WA0049

రబీ సీజన్‌లో యూరియా కోసం ప్రత్యేక మొబైల్ యాప్ 

రైతులకు ఎరువుల సరఫరా మరింత సులభతరం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం డిసెంబర్ 20 

రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు యూరియా సరఫరా, అమ్మకాలను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. డిసెంబర్ 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్‌ను అమలు చేయనున్నట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు క్యూలలో నిలబడకుండా ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. డీలర్ల స్టాక్ వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉండగా, బుకింగ్ ఐడీ ఆధారంగా యూరియా పొందవచ్చన్నారు. రైతువేదికల్లో యాప్‌పై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version