ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ఖమ్మంలో నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కర్నె దివ్య కి
వినతి పత్రం అందజేసిన జి ఎల్ బి కే ఎస్ (ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర కార్యదర్శి
యస్ డి నా సర్ పాషా మరియు మిత్ర బృందం సూర్యాపేట దేవరపల్లి నిర్మాణ దశలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవేలో టీ నర్సాపురం వద్ద ఎగ్జిట్ ఇవ్వాలనీ కోరుతూ బుధవారం నాడు ఖమ్మంలో నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కర్నె దివ్య కి ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఐ ఎఫ్ టి యు అనుబంధ గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా విలేకరులకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే జాతీయ రహదారిలో టీ నర్సాపురం వద్ద ఎగ్జిట్ ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం టీ నర్సాపురం మండల ప్రజలు ఎంతో విలువైన తమ పచ్చని పొలాలను తోటలను కూడా త్యాగం చేశారన్నారు. టీ నర్సాపురం మండలానికి చెందిన అనేకమంది యువతి యువకులు పలు కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వివిధ ఉద్యోగాల రీత్యా నివసిస్తున్నారనీ దాంతో ఈ మండలం నుండి హైదరాబాద్ కి వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉంటాయన్నారు.ఈ ప్రాంత ప్రజల అవసరాలను, త్యాగాలను గుర్తించి మండల కేంద్రం టీ నర్సాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే లో ఎగ్జిట్ ఇచ్చే విధంగా తగు చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ ని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మానికి చెందిన మిత్ర బృందం ఊరుకొండ శ్రీనివాస్, మిట్టకోలు లక్షణాద్రి, ఎండి అహ్మద్, ఎండి ఫిరోజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట దేవరపల్లి నిర్మాణ దశలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవేలో టీ నర్సాపురం వద్ద ఎగ్జిట్ ఇవ్వాలి
by Naddi Sai
Published On: November 20, 2024 9:01 pm