సంగారెడ్డి ప్రతినిధి, జూలై 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇటీవల ఘోరంగా జరిగిన ప్రమాదంపై నిపుణుల కమిటీ పరిశీలించింది. మంగళవారం మూడున్నర గంటలకు పైగా కమిటీ సభ్యులు ప్రమాద స్థలిలో తిరుగుతూ పరిశ్రమ స్థితిగతులు, ప్రమాదానికి దారి తీసిన పరిణామాలు, భద్రతా లోపాలపై వివరాలు సేకరించారు. పరిశ్రమ యాజమాన్యం, సాంకేతిక నిపుణులతో సమావేశమై వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ దృష్టి సారించింది. కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
సిగాచి పరిశ్రమను పరిశీలించిన నిపుణుల కమిటీ

Oplus_0