Headlines (Telugu):
-
“ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణంలో కాలం చెల్లిన మందుల దందా”
-
“డ్రగ్ కంట్రోల్ దాడుల్లో ఫిజీషియన్ల శాంపిళ్లు బయటపడ్డాయి”
-
“ప్రయివేటు మెడికల్ షాపులపై షాకాజ్ నోటీసులు: అధికారులు చర్యలు చేపట్టారు”
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రయివేటు మెడికల్ షాపుల దందా..
డీసీఏ దాడుల్లో విస్తుపోయే నిజాలు..
షాకాజ్ నోటీసులు జారీ
ప్రభుత్వాస్పత్రుల ప్రాంగాణాల్లో కొలువుదీరిన ప్రయివేటు మెడికల్ షాపుల్లో కాలం చెల్లిన మందులు బయటపడ్డాయి. ఫిజీషియన్ శాంపిళ్లు ఆ మెడికల్ షాపుల్లో దర్శనమిచ్చాయి. నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ఆ మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. డ్రగ్ కంట్రోల్ అధికారులు హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ఆస్పత్రుల్లోని ప్రయివేటు మెడికల్ షాపులపై ఏకకాలంలో దాడులు చేశాయి. 15 మెడికల్ షాపులకు షాకాజ్ నోటీసులను జారీ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాంగణంలోని వైష్ణవి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, జీవన్ ఉష స్రవంతి జెనరిక్ మెడికల్ స్టోర్స్, కులీ కుతుబ్ షా మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, జీవన్ ధారా ఫార్మసీ, అమ్రిత్ ఫార్మసీ (హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ యూనిట్), నిలోఫర్ ఆస్పత్రిలో ప్రాంగణంలోని సాయి ఫార్మసీ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్, అమ్రిత్ ఫార్మసీ, పెట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి ప్రాంగణంలోని జన జీవనీ జ్యోతి స్టోర్స్‌పై దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్‌లో గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తిరుమల మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, శ్రీసాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, జీ.పీ.మొహిత్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో ప్రజారోగ్య ఫార్మసీ (ఉమెన్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్) అమ్రిత్ ఫార్మసీ (హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ యూనిట్), రాణి రుద్రమ దేవి జీవన్ ధారా ఫార్మసీ తో పాటు కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీవన్ ధారా ఫార్మసీ (జెనెరిక్ మెడికల్ షాప్ ), ప్రజారోగ్య ఫార్మసీ (ఉమెన్ మెడికల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్)లలో దాడులు చేసిన తనిఖీలు చేశారు. మెడికల్ షాపులపై దాడుల్లో ఈ దుకాణాలు అనేక విధాలుగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు బయట పడిందని డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ వీ.బీ.కమలాసన్ రెడ్డి తెలిపారు. మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల అమ్మకం, రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ లేకపోవడం, షెడ్యూల్డ్ డ్రగ్స్‌కు సంబంధించిన రిజిస్టర్లు లేకపోవడం, సేల్స్ అండ్ పర్చేస్ బిల్లులను చూపించ లేకపోవడం, స్టోరేజ్ కండీషన్ల మేరకు మందులను స్టోర్ చేయకపోవడం, ఫిజిషియన్ల శాంపిళ్లు, ప్రభుత్వ సరఫరా మందులు, కాలం చెల్లిన మందులున్నట్టు దాడుల్లో వెల్లడైంది. షోకాజ్ నోటీసులకు సంబంధిత మెడికల్ షాపుల యాజమా న్యాలు వివరణ ఇచ్చిన తర్వాత డ్రగ్స్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.