ఎక్స్‌పైరీ డేట్ పౌడర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..
ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన పాలపొడితో అడ్డంగా దొరికిపోయాడు…
బయట హోటల్ లో స్వీట్లు తింటున్నారా.. అయితే ఓ సారి ఈ వార్త చదివాక ఆలోచించుకోండి.. ఎందుకంటే హైదరాబాద్‌లో ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన పాల పౌడర్ పట్టుకున్నారు పోలీసులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదువేల కిలోలకుపైగా ఎక్స్‌పైరీ డేట్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు. సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. పట్టుకున్న ఈ పోడిని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే పాల పొడి గుర్తించారు. దీనిని అక్రమంగా తెలంగాణలోకి తీసుకువచ్చి పన్నీరు, స్వీట్లలో కలిపి అమ్ముతున్నారు అక్రమార్కులు. తార్నకలో దామోదర్ అనే ఓ వ్యాపారి నుంచి ఈ పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ పాలపొడిని కర్ణాటక రాష్ట్రం క్షీర భాగ్య పథకానికి చెందినదిగా గుర్తించారు. ఈ పోడిని అక్కడ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తారు. పక్కా సమాచారంతో ఈ ముఠాను తార్నాకాలోని విజయపురి కాలనీలో పట్టుకున్నారు పోలీసులు..