Site icon PRASHNA AYUDHAM

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల వ్యవధి 2 నెలల పొడిగింపు

Screenshot 20251230 194231 1

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల వ్యవధి 2 నెలల పొడిగింపు

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా డిసెంబర్ 30:

తెలంగాణ రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల విభాగం పరిధిలోని వర్కింగ్ జర్నలిస్టులకు జారీ చేసిన ప్రస్తుత రాష్ట్ర, జిల్లా అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు వ్యవధిని రెండు నెలల పాటు పొడిగించినట్లు జిల్లా పౌర సంబంధాల అధికారిణి బి. తిరుమల (DPRO) తెలిపారు. 31-12-2025తో ముగియనున్న అక్రిడిటేషన్ కార్డుల గడువును జర్నలిస్టులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 01-01-2026 నుండి 28-02-2026 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. అర్హులైన జిల్లా మీడియా మిత్రులు బుధవారం (31-12-2025) మధ్యాహ్నం 2.00 గంటలకు డీపీఆర్ఓ కార్యాలయంలో తమ అక్రిడిటేషన్ కార్డులపై స్టిక్కర్లు వేయించుకోవాలని తెలిపారు.

Exit mobile version