ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 15 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చొరవతో రైన్ వాటర్ ప్రాజెక్ట్ బృందం మరియు స్టూడియో పంచతంత్ర బృందం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బృందాలు ముందుగా కిన్నెరసాని అభయారణ్యం ను సందర్శించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సభ్యులకు కిన్నెరసాని లో ప్రత్యేకతల గురించి పర్యాటక రంగం అభివృద్ధి కోసం చేపడుతున్న పనులు మరియు తీసుకోవలసిన చర్యలు గురించి వివరించారు. అనంతరం కిన్నెరసాని ప్రాజెక్ట్ లో బోటు లో ప్రయాణించి ఆనంద ద్వీపంను సందర్శించారు. డ్రోన్ కెమెరా ద్వారా కిన్నెరసాని అభయారణ్యం అందాలను బృంద సభ్యులు వీక్షించారు. జింకల పార్కు, ప్రాజెక్ట్, బాతుల పార్క్ ను పరిశీలించారు.అనంతరం కిన్నెరసాని ప్రాజెక్ట్ కేటీపీఎస్ కుడి కాలువలో పుట్టి ప్రయాణం ను ప్రారంభించారు.
అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శించుకుని ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. తదుపరి గోదావరి ఘాట్ ను సందర్శించారు. అనంతరం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నిర్మిస్తున్నటువంటి గిరిజన మ్యూజియం ను సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు, గిరిజనులు ఉపయోగించే వస్తువులు మరియు గిరిజనుల ప్రత్యేక వంటకాల గురించి బృందాలకు కలెక్టర్ వివరించారు. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయం మరియు నార చీరల ప్రాంతం సందర్శించి అక్కడి స్థల పురాణం మరియు ప్రత్యేకతలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బుజ్జిగుప్ప నారాయణరావుపేట గ్రామంలో బృంద సభ్యులు పర్యటించారు. అక్కడ పాతకాలం ఇళ్లను పరిశీలించి,కోయ భాష, గిరిజన సాంస్కృతి, కొమ్ము డాన్స్ మరియు వెదురుతో చేసిన కళాకృతుల గురించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.నారాయణరావుపేటలోపర్యాటకరంగా అభివృద్ధిలో భాగంగా పర్యాటకులు గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకునేందుకు వీలుగా పర్యాటకులు బస చేయడానికి వెదురుతో నిర్మిస్తున్నటువంటి ఇళ్లను మరియు కోయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరిచేలా చేపడుతున్న నిర్మాణాల గురించి బృంద సభ్యులకు అధికారులు వివరించారు. స్థానిక గిరిజనులతో ముచ్చటించి పర్యాటకరంగా తమ గ్రామం ఎలా అభివృద్ధి చేసుకోవాలో పలు సూచనలు చేశారు.ఈ పర్యటనలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చొరవతో రైన్ వాటర్ ప్రాజెక్ట్ స్టూడియో పంచతంత్ర బృందాల విస్తృత పర్యటన.
by Naddi Sai
Published On: December 15, 2024 8:21 pm
