*నేత్రదాత డాక్టర్ జీడి అంకూస్ సంస్మరణ సభ*
*జమ్మికుంట జనవరి 8 ప్రశ్న ఆయుధం*
నేత్రదానంతో ఇద్దరు అందుల జీవితాల్లో వెలుగులు నింపిన నేత్రదాత డాక్టర్ అంకూస్ సంస్మరణ సభ బుధవారం జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి భవనంలో సదాశయ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేత్రదాత డాక్టర్ జీడి అంకూస్ ఇటీవల మృతి చెందగా నేత్రదానం చేశారు.ఈ సందర్భంగా సంస్మరణ సభను ఏర్పాటు చేసి ,వచ్చిన బంధు మిత్రులకు నేత్ర అవయవ శరీర దానాలపై కరీంనగర్ జిల్లా కన్వీనర్ మచ్చగిరి నరహరి, డాక్టర్ శ్రీనివాస రెడ్డి, డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు అవగాహన కల్పించి కుటుంబ సభ్యులకు జ్నాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన భార్య కటుకూరి స్వరూప కుమారుడు సందీప్ ,కూతుర్లు, శిల్ప, రుతీషా సహకరించిన డీలర్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు, చిటికేసి శివానందయ్య చిదురాల శ్రీనివాస్ ముత్యాల జగదీశ్వర్ లకు
సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ , జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నరహరి అభినందనలు ధన్యవాదాలు తెలిపారు.