*క్రీడా ప్రాంగణాల్లో వసతులు ఏర్పాటు చేయాలి, క్రీడాశాఖ చైర్మన్ శివసేనా రెడ్డిని సన్మానించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల*
క్రీడా ప్రాంగణాల్లో అన్నీ విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని *డీసీఎంస్ డైరెక్టర్
రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు* క్రీడా శాఖా చైర్మన్ ను కోరారు. తెలంగాణా *రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటి చైర్మన్ కె.శివసేనారెడ్డి* కొత్తగూడెం నియోజకవర్గం పర్యటన సందర్బంగా సిఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీలో చైర్మన్, అధికారులతో పాటు *కొత్వాల* పాల్గొన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసకాలనీ వద్ద గల క్రీడా ప్రాంగణంను క్రీడా చైర్మన్ సందర్శించారు. టెన్నిస్ కోర్టును, ఆర్చరీ కోర్టును పరిశీలించారు. ఈ సందర్బంగా *కొత్వాల* ఆయనను సన్మానించారు. ఈ సందర్బంగా *కొత్వాల* మాట్లాడుతూ పాల్వంచలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, వాకింగ్ ట్రాక్, 400 మీటర్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అన్నారు. యువతను క్రీడల వైపు మళ్ళించేలా ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎం. పరంధామరెడ్డి, వై. వెంకటేశ్వర్లు, జి. యుగందర్ రెడ్డి, చీకటి కార్తీక్, కబీర్, అన్నం వెంకటేశ్వర్లు, కె. మహిధర్, కొండం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Post Views: 1