*అధికారులే టార్గెట్గా లక్షలు వసూలు చేస్తున్న నకిలీ క్రైమ్ మిర్రర్ విలేకరుల అరెస్ట్*
*-మూడు సెల్ ఫోన్లు,లాప్టాప్ స్వాధీనం*
*-వీర గాధ….టైటిల్ తో సిఐని బెదిరింపులు*
*-ఇద్దరు నిందితులు అరెస్ట్ మరొకరు పరారీలో*
*వివరాలు వెల్లడించిన డిఎస్పి కే.రాజశేఖర్ రాజు*
,మిర్యాలగూడ ఫిబ్రవరి 02:
జిల్లాలో అధికారులను టార్గెట్ చేసి బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ లను అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు. ఆదివారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ వివరాలు వెల్లడించారు. గత కొద్ది నెలలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో
నకిలి విలేఖరుల ముసుగులో గుర్తింపు లేని క్రైమ్ మిర్రర్ (డిజిటల్ పెపర్) అంటూ ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నవంటి ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసు,పరారీలో మరొక ప్రధాన నిందితుడు.వీరి వద్ద నుండి ఒక లాప్ టాప్, బాధితుల ద్వారా అమౌంట్ పంపించుకున్న3 సెల్ ఫోన్ లు స్వాధీనం.“వీరగాధ” అనే పేరుతో మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఏటువంటి ఆధారాలు లేకున్నా క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్ లో అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరి బాధ తట్టుకోలేక సి.ఐ తీవ్ర మనస్తాపానికి చెంది సదరు క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) యాజమాన్యం అంజి, రఘు,ఆనంద్ లను సంప్రదించగా నేరస్తులు మొదటగా 5 లక్షలు ఇస్తే తన గురించి ప్రచారం చేయమని డిమాండు చేసినారని, ఆ తర్వాత చివరగా 2 లక్షల రూపాయలు ఇస్తే ఎలాంటి తప్పుడు వార్తలు రాయము అని చెప్పగా, సిఐ అంత డబ్బు ఇవ్వలేను, తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి డబ్బు నిరాకరించారు.కానీ క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) వాళ్ళు వ్రాసిన నిరాధార వార్తలకి సి.ఐ, కుటుంబసభ్యులు క్రుంగిపోతుండడంతో,ఈ విషయం తెలుసుకున్న సిఐ స్నేహితుడు 2025 జనవరి 24వ తేదీన రోజున క్రైయిమిరర్ రిపోర్టర్ అంజి ని తన స్నేహితుడు ఇంటికి రమ్మనగా ఆనంద్, రఘులకి విషయం చెప్పిన అంజి, సిఐ స్నేహితుడి దగ్గరికి వచ్చి బేరమాడిన తరువాత చివరగా 1,10,000 /- లను అంజి తీసుకున్నాడు.ఇందుకు సంబందించి ఆడియో వీడియో ఆధారాలు కలవు. ఇందులో అంజి 10 వేల రూపాయల తన వద్ద ఉంచుకొని, మర్రిగూడ మండలాన్ని చెందిన క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) రఘు కి జనవరి 24వ తేదీన వేములపల్లి లో Rs.1,00,000 /- ఇవ్వడం జరిగింది. ఇందులో Rs.85,000 /- రఘు నల్లగొండ నుండి ఏటీఎం డిపాజిట్ మిషన్ ద్వారా తన అక్కౌంట్ లో వేసుకొని ఆనంద్ కు పంపడం జరిగినది.ఇందుకు సంబందించి రఘు ఫోన్ లో ఆధారాలు కలవు.కానీ సదరు క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) మరలా డబ్బులు కావాలని లేకపోతే క్రైమ్ మిర్రర్ పేపర్ లో సిఐ వ్యక్తిగత విషయాలు వ్రాస్తానని భేదిరిస్తున్నాడని తెలిసి మిర్యాలగూడ టూ టౌన్ పియస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినది.కాగా మిర్యాలగూడ రూరల్ సి.ఐ వీరబాబు పై క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) లో వచ్చిన అవినీతి ఆరోపణల పై జరిగిన విచారణ క్రమం లో నిందితులు తమ వైపునుండి ఎటువంటి ఆధారాలు అందించలేక పోయినారు.
పై విషయం సోషల్ మీడియా లో వైరల్ కాగా అనేక మంది క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) బాడితులు జిల్లాలో వేరువేరు ప్రాంతాలలో ఫిర్యాదు చేయడం జరిగినది.అందులో ముఖ్యంగా నాగార్జున సాగర్ లో అటవీశాఖ అధికారిగా పని చేస్తున్న వ్యక్తి వద్ద పైన తెల్పిన నేరస్తులు గతంలో అతను మునుగోడు రేంజ్ మర్రిగూడ సెక్షన్ లో పని చేస్తున్న రోజులలో తన పైన కూడా లేనిపోని కథనాలు రాస్తామని బ్లాక్ మెయిల్ చేసి వాట్సాప్ కాల్స్ లో మాట్లాడి బెదిరించి 50 వేల రూపాయలు పొన్ పే ద్వారా వసూలు చేయడం జరిగింది. ప్రస్తుతం టివి లో వస్తున్న కథనాలను చూసి బాధితుడు పిర్యాదు చేయగా సాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినది.అలాగే గత సంవత్సరం ఆగష్టు నెలలో సూర్యపేట అసిస్టెంట్ స్తాటికల్ ఆఫీసర్ (హెల్త్ డిపార్ట్మెంట్) గా పని చేస్తున్న అధికారి వద్ద ఈ నేరస్తులు గతంలో నల్గొండ డిఎంహెచ్వో లో పని చేస్తున్న రోజులలో తన పైన కూడా లేనిపోని కథనాలు రాస్తామని బ్లాక్ మెయిల్ చేసి వాట్సప్ కాల్స్ లో మాట్లాడి బెదిరించి 50 వేల రూపాయలు పొన్ పే ద్వారా పంపించుకోవడం జరిగిందని ప్రసుత్తo టివి లో వస్తున్న కథనాలను చూసి బాధితుడు పిర్యాదు చేయగా నల్గొండ వన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగింది.నిందితుల వివరాలు:-ఆనంద్ కుమార్, బ్యూరో ఎడిటర్, క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్) ( పరారీ).తుప్పరి రఘు(29) వృత్తి:క్రైమ్ మిర్రర్ (డిజిటల్ పేపర్) స్టాఫ్ఫర్,వట్టిపల్లి గ్రామం,మర్రిగూడ మండలం.పేరబోయిన ఆంజనేయులు
(34) తండ్రి జానకి రాములు,కులం:ముదిరాజ్,నివాసం: పాములపాడు గ్రామం, మాడ్గులపల్లి మండలం.గత నెల రోజులుగా క్రైమ్ మిర్రర్(డిజిటల్ పేపర్).ఇట్టి అక్రమ వసూళ్లకు సంబందింది బాడితులకి నిందితులకు మధ్య జరిగిన ఫోన్ పే లావాదేవీల ఆధారాలు నిందితుల ఫోన్ లో కలవు.మిర్యాలగూడ టూ టౌన్ పియస్ లో నమోదు అయిన కేసు విచారణలో భాగంగా ఆదివారం నాడు గత కొంత కాలంగా విలేకరుల ముసుగులో క్రైమ్ మిర్రర్ (డిజిటల్ పేపర్) అంటూ ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తూ ఏలాంటి ఆధారాలు లేకుండా, అక్రిడేషన్ లేకుండా డిజిటల్ పేపర్ ద్వారా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తూ వాటిని అపాలంటే అడిగినంత డబ్బులు డిమాండు చేస్తూ వసూలుకు పాల్పడుతున్న తుప్పరి రఘు, పేరబోయిన ఆంజనేయులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ చేపట్టి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు.వారి వెంట సీఐ పి.నాగార్జున, పోలీస్ సిబ్బంది ఉన్నారు.