నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి… భూమి రిజిస్ట్రేషన్

రిజిస్ట్రేషన్
Headlines
  1. నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్: బాధితుల ఫిర్యాదు
  2. రిజిస్ట్రేషన్ అధికారులను మోసం చేసిన చెక్క లక్ష్మణ్
  3. నిజామాబాద్ జిల్లాలో భూమి కుంభకోణం
  4. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మార్ఫింగ్ కలకలం
  5. నకిలీ సర్టిఫికెట్లపై జిల్లా కలెక్టర్ వద్ద ఫిర్యాదు
నిజామాబాద్ జిల్లా

నకిలీ ధ్రువీకరణ పత్రాలతో స్వంత అన్న భూమిని గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు.బాధితుల వివరాల ప్రకారం..నగరంలోని కోటగల్లి లో నివాసం ఉంటున్న చెక్క సాగర్ కు సంబంధించిన 52 గజాల భూమి,అలాగే ఇంకో ఇద్దరు తమ్ముళ్లు భూమిని చెక్క లక్ష్మణ్ అనే వ్యక్తి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి,అందరి భూమిని తన పేరు మీద చేసుకున్నట్లు తెలిపారు.చెక్క లక్ష్మణ్ చదువురాని మా అమ్మను మోసం చేసి అలాగే రిజిస్ట్రేషన్ అధికారి ని సైతం మోసం చేసి తప్పుడు సర్టిఫికెట్లతో తన 206 నంబర్ గల భూమిని తన పేరు మీద చేసుకున్నట్లు వాపోయారు.మా తమ్ముడు మాకు తెలియకుండా మా నాన్న చెక్క గంగారం మరణించిన సందర్భంగా తీసుకున్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను మార్ఫింగ్ చేసి,నా పేరు మా అక్క పేరును తొలగించే ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి,గుర్తు తెలియని వ్యక్తులతో సాక్షి సంతకాలు పెట్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

Join WhatsApp

Join Now