*మన్యంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు*
ఏపీలో అల్లూరి సీతారామ రాజు జిల్లా మన్యంలోని గిరిజన గ్రామాల్లో చలి వణికిస్తోంది.రోజురోజుకు అక్కడ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరు ప్రాంతం సమీపంలోని మినుములూరు, కాఫీ బోర్డు కేంద్రాల వద్ద 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వనజంగి, అరకులో12 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ
జిల్లా ఏజెన్సీని పొగమంచు కప్పేసింది. దీంతో అక్కడ
పర్యాటకులు భారీగా పెరిగారు.