*సాయి ఆశ్రమంలో గల శృతి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభించిన జడల కుటుంబ సభ్యులు*
*సాయి ఆశ్రమానికి రూ 1,50,000 విలువగల పేపర్ ప్లేట్స్ మిషన్ బహుకరణ*
*జమ్మికుంట జులై 3 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంటపట్టణంలోని మారుతీ నగర్ లో గల సాయి మానసిక దివ్యంగా విద్యార్థులు ప్రత్యేక పాఠశాలకు జమ్మికుంట పట్టణానికి చెందిన జడల భాస్కర్ రావు ఐరన్ అండ్ హార్డ్వేర్ మర్చంట్ యజమాని తన సహోదరుడు జడల రవికుమార్ శ్రీ రేఖ అమెరికా వారు దివ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే రూ1,50,000 విలువగల పేపర్ ప్లేట్స్ మిషన్ ను బహుకరించారు పేపర్ ప్లేట్స్ మిషన్ ను గురువారం జడల భాస్కర్ రావు కుమారుడు జడల సందీప్ కుమార్ శ్రీజ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం జడల సందీప్ కుమార్ మాట్లాడుతూ ఈ ఆశ్రమానికి రావడం చేతుల మీదుగా పేపర్ ప్లేట్స్ మిషన్ ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామని ఈ ఆశ్రమానికి ఎలాంటి సహాయాన్ని అయినా అందిస్తామని ఈ వారు తెలిపారు సహకారాన్ని ముందు ముందు దివ్యాంగ విద్యార్థులకు ఇంకా అందిస్తామని వారు తెలియజేశారు.
దివ్యాంగ విద్యార్థులకు అందజేస్తున్న జల భాస్కర రావు కుటుంబ సభ్యుల అందరికీ పేరెంట్స్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామనీ పాఠశాల వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చి రాములు తెలిపారుఈ కార్యక్రమంలోజడల భాస్కర రావు,ఆయన సతీమణి సునీత, పేరెంట్స్ కమిటీ జాయింట్ సెక్రటరీ, మహమూద్ పాషా,పేరెంట్స్ కమిటీ కోశాధికారి శాంతాదేవి,
పేరెంట్స్ కమిటీ మెంబర్ పొనగంటి మల్లయ్య
నయన కంటి దావఖాన డాక్టర్ సురేష్ బాబు
జగదీశ్వర్ పాఠశాల సిబ్బంది పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.