Site icon PRASHNA AYUDHAM

ఫ్యామిలీ పార్టీలో డ్రగ్స్ వాడొచ్చా..?

డ్రగ్స్

Headlines:

  1. “టీపీసీసీ ప్రతినిధి సత్యం శ్రీరంగం: డ్రగ్స్ వాడుకపై తీవ్ర విమర్శలు”
  2. “కెటిఆర్ ఫార్మ్ హౌస్ రెయిడ్ పై టీపీసీసీ స్పందన”
  3. “ఫ్యామిలీ పార్టీలో డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ ఎందుకు వస్తుంది?”
  4. “తెలంగాణలో డ్రగ్స్ రహిత ప్రభుత్వానికి కాంక్ష”

కుటుంబ పార్టీ జరిగి ఉంటే డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ ఎందుకు వస్తుంది – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29: కూకట్‌పల్లి ప్రతినిధి 

కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ని నియంత్రిస్తుంది డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే భాద్యత ప్రజా ప్రభుత్వానిది టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం

జన్వాడ ఫామ్ హౌస్ రెయిడ్ పై మాజీ ఐటీశాఖ మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం, లింగం యాదవ్, గజ్జి భాస్కర్. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ కెటిఆర్ మీ ఎమ్మెల్యేలేమో జన్వాడ ఫార్మ్ హౌస్ లో దీపావళి పండుగ జరిగితే రెయిడ్ చేసారని ధర్నా చేసారు. మీరేమో గృహ ప్రవేశం జరిగిందన్నారు. ఈ రెండింటిలో ఏది నిజం అని ప్రశ్నించారు. ఫ్యామిలీ పార్టీలో కేసినో కాయిన్స్ ఉండొచ్చా, డ్రగ్స్ వాడొచ్చా అని ప్రశ్నించారు. గతంలో ఇదే డ్రగ్స్ ఆరోపణ మీద ఈ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ మాఫియా పట్టి పీడిస్తోందని డ్రగ్స్ మాఫియాతో కుమ్మకై అప్పుడొక విచారణ కమిటీ వేసి అనేక మంది సినీ తారల్ని, సినిమా హీరోలని బెదిరించి ఆ కమిటీ రిపోర్ట్స్ రాకుండా చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. కుటుంబ పార్టీ జరిగి ఉంటే డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ ఎందుకు వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ ని నియంత్రిస్తుంటే కెటిఆర్ అండ్ టీం దారుణాలకు పాల్పడుతుందని ఆరోపించారు. తెలంగాణను డ్రగ్స్ స్టేట్ గా చేసేందుకు బిఆర్ఎస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఫార్మ్ హౌస్ రెయిడ్ లో దొరికిన కెటిఆర్ బావమరిదిని, ఇతర వ్యక్తులను ఎంక్వయిరీ చేయాలనీ కోరారు. తాగి దొరికిన కేసులో బుకాయించి మాట్లాడితే తప్పుఒప్పయిపోతుంది అంటే పొరపాటని అన్నారు. కెటిఆర్ ఫార్మ్ హౌస్ లో అసాంఘిక కార్యక్రమాలు జరగడం చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని అన్నారు. నిన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కండి అన్నారు. ఆ మాట అనే నైతికత మీకుందా ఆ మాట మీ నోట ఎలా వచ్చింది గతంలో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళినపుడు మీరు రాజీనామా చేసారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల్ని పార్టీలు మార్పించిన ఘనత మీది కాదా అని అన్నారు.

Exit mobile version