*ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూత*
*Jul 14 2025*
ప్రముఖ నటి జి.సరోజా దేవి కన్నుమూశారు. యశ్వంత్‌పూర్‌లోని మణిపాల్ ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. 1938, జనవరి 7న బెంగళూరులో జన్మించిన ఆమె.. 1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ మూవీతో చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. NTR, ANR, MGR లాంటి దిగ్గజ నటులతో కలిసి సినిమాలు చేశారు. తెలుగులో దాగుడు మూతలు, పండంటి కాపురం, దాన వీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం వంటి హిట్ చిత్రాల్లో నటించారు.