ప్రముఖ సింగర్ కన్నుమూత

*ప్రముఖ సింగర్ కన్నుమూత*

*హైదరాబాద్:మే 17*

అస్సాం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది, ప్రముఖ అస్సామీ సింగర్ గాయత్రి హజారికా( 44 )ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధప డుతున్న ఆమె గువహతి లోని నేమ్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

ఆమె అకాల మరణం పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నివాళి అర్పిం చారు..ఆమె మరణం అస్సామీ సంగీతానికి తీరని లోటు’ అని ఆయన తెలిపా రు. అలాగే పలువురు సినీ, సాంస్కృతిక ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

సరా పాటే పాటే నామే జోనాక్ నాశిల్ బనత్ ఆబేలిర్ హెంగులీ ఆకాశే’ పాటలతో అస్సామీ సంగీత రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న గాయత్రి హజారికా ‘యేతియా జోనాక్ నామిశిల్,మాతో ఏజాక్ బరషున్’తోమాలై మోర్ మరమ్’ వంటి పాటలు ఆలపించింది.

Join WhatsApp

Join Now