రామ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధునికి వీడుకోలు
యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూర్ ( యం) మండలం సర్వేపల్లి గ్రామంలో మంగళవారం రామ్ సేన,యూత్ అసోసియేషన్ వారి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు నిర్వహించి,మహిళలు ఆట పాటలతో ఊరేగింపు చేసి విగ్రహ దాతలను,అన్నదాతలను సన్మానించి ఘనంగా నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో రామ్ సేన యూత్ అసోసియేషన్, సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.