స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్ కు ఘన వీడ్కోలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ కోచ్ గా 2019 లో గచ్చిబౌలి స్టేడియం నుండి బదిలీపై సంగారెడ్డి స్విమ్మింగ్ కోచ్ గా శ్రీనివాస్ వచ్చి సుమారు నాలుగున్నర సంవత్సరాల పాటు సేవలు అందించారు. కాగా డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గా పదోన్నతి పొంది బదిలీపై కరీంనగర్ జిల్లా వెళ్తున్న స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్ కు సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ ఆలీ, స్విమర్స్ ఆయనకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. శ్రీనివాస్ గౌడ్ సంగారెడ్డి జిల్లా నుండి పదిమంది సిమ్మర్స్ ను రాష్ట్ర స్థాయిలో పాల్గొని స్థాయికి వారిని తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఎంతో మంది స్విమర్స్ కు స్విమ్మింగ్ తనదైన శైలిలో ప్రతిభ కనబరిచి ఎంతో మంది మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో అభినవ్, పవన్, చౌహన్ పవన్ కుమార్, కృష్ణ, కుమార్, స్విమర్స్ మొహమ్మద్ అబ్దుర్ రెహమాన్ సిద్ధిఖ్, నిషిత, మోక్షిత్, మహమ్మద్ ఉజేర్, విన్సెంట్, నిర్విజ్ఞ, మాధవ్, రోషిత్, వినీత్, తక్షిత్ తో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now