హైదరాబాద్, నవంబరు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్):శంషాబాద్ మండల పరిధిలోని బహదూర్ గూడ గ్రామంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల మోజెర్ల విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బహదూర్ గూడ రైతు వేదిక లో రైతు అవగాహన సదస్సు, ఉద్యాన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ఆకృతులతో భూసార పరీక్షలు, జీవన ఎరువులు, హరిత గృహాలు, బహుళ అంతస్తుల పంటలు, తేనెటీగల పెంపకం, వర్మీ కంపోస్టింగ్ లాంటి ఉద్యాన రంగంలోని వివిధ ఆధునిక విశేషాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన పరిశోధన స్థానం ఏ.ఓ. రాఘవేంద్ర, ఉద్యాన కళాశాల మోజర్ల ఉపాధ్యాయులు కళాధర్ బాబు, ఎంఏపీఆర్ఎస్ పరిశోధనా కేంద్రం ప్రొఫెసర్ కృష్ణ వేణి పాల్గొని మాట్లాడారు. ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన మెలకువలు మరియు ఉద్యాన పంటల్లోని వివిధ అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మేఘన, సౌమ్య, రచన, నేహా, అఖిల, శరత్ చంద్రిక, రాజేశ్వరి, ఝాన్సీ రాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఉద్యాన విద్యార్థుల ఆధ్వర్యంలో రైతు అవగాహన, ఉద్యాన ప్రదర్శన
Published On: November 18, 2025 7:57 pm