*ఏరీస్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు*
వలిగొండ మండల కేంద్రంలో గల దేవి శ్రీ ఫంక్షన్ హాల్ లో వరి పంట పండించే రైతు మహాశయులందరూ వరి సాగులో సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు కచ్చితంగా పాటించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ అధికారి బండ్లమూడి నాగేశ్వరరావు అన్నారు.. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని లోతుకుంట దేవిశ్రీ గార్డెన్స్ లో వరి పంట రైతు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ అధికారి బండ్లమూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వరి సాగు చేసే రైతులందరూ కచ్చితంగా సమగ్ర పోషక యజమాన్య పద్ధతులను పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు పొందాలని సూచించారు.. ముఖ్యంగా వరి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సూక్ష్మ దాతులోపాలు అనగా, జింక్, ఐరన్, మాంగనీస్, కాపర్, బోరాన్, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ మొదలగు సూక్ష్మ దాతులోపాలను ఎలా ఎదుర్కోవాలో ఆ సమయంలో పంటలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి అనుకూలంగా సూచనలను తెలియపరచడం జరిగింది. ఏ సమయంలో ఎలాంటి ఎరువులను వరి పంటపై పిచికారి చేయాలి