ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (ప్రశ్న ఆయుధం):
ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన కొండ అమృతరావు (48) బుధవారం మధ్యాహ్నం తన వ్యవసాయ భూమిలో బోరు మోటార్ ఆన్ చేయబోతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయంపై ఎల్లారెడ్డి ఎస్‌ఐ మహేష్ మాట్లాడుతూ మృతుడి భార్య కొండ సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.
మృతుని కుటుంబాన్ని పరామర్శిస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబాతో ఫోన్ ద్వారా మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అందవలసిన ప్రభుత్వ సహాయాలు, బెనిఫిట్లు త్వరగా అందేలా అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం.
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గురువారం కురుమ సాయిబాబా మృతుని కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ఉషా గౌడ్, PACS వైస్ చైర్మన్ పద్మమరావు, గ్రామ అధ్యక్షుడు ప్రవీణ్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.