రైతు శ్రీకాంత్ రెడ్డి దీక్ష విరమణ

రైతు శ్రీకాంత్ రెడ్డి దీక్ష విరమణ

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎదుట మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రియల్,గ్రీన్ జోన్ లను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ రైతు శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన అమరాన నిరాహార దీక్ష ను మూడో రోజు రైతుల అభిప్రాయం మేరకు రైతు శ్రీకాంత్ రెడ్డి దీక్షను విరమించారు. ఈ సందర్భంగా రైతు శ్రీకాంత్ రెడ్డి కి రైతులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈనెల 19 న అడ్లూర్ ఎల్లారెడ్డి లో రైతు కార్యచరణ కమిటీ 8 గ్రామాల రైతులం సమావేశమై మొదటగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లాడి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డిలను కలిసి జీవో రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, రద్దు చేసిన జీవో కాపీనీ తమకు అందజేయాలని కోరనున్నట్లు రైతులు తెలిపారు. వినతి పత్రాలు ఇచ్చిన వారు స్పందించకపోతే రోజుకో గ్రామంలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు రైతులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now