*రైతు భరోసా దరఖాస్తుకు ఈనెల 30కి గడువు పూర్తి*
*ఇల్లందకుంట జనవరి 27 ప్రశ్న ఆయుధం*
మండలంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినవారు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు రైతులు కంగారు పడకుండా ఆయా క్లస్టర్ పరిధిలోని రైతులు తమ క్లస్టర్ పరిధిలో ఇవ్వాలని కోరారు ఇల్లందకుంట మండల పరిధిలో నాలుగు క్లస్టర్లు ఉండగా వాటిలో ముగ్గురు మాత్రమే వ్యవసాయ విస్తరణ అధికారులు ఉండగా ఇల్లందకుంట క్లస్టర్ను ముగ్గురికి బదిలాయించడం జరిగిందని తెలిపారు మల్యాల క్లస్టర్ పరిధిలో ఏ ఈ ఓ సంపత్ యాదవ్ వాగోడ్డు రామన్నపల్లి మల్యాల లక్ష్మాజిపల్లి కనగర్తి గ్రామాలు అదనంగా టేకుర్తి రెవిన్యూ విలేజి బూజునూరు క్లస్టర్ పరిధిలో ఏ ఈ ఓ రాకేష్ బూజునురు వంతడుపుల సీతంపేట రాచపల్లి గ్రామాలు అదనంగా చిన్నకుమటిపల్లి రెవెన్యూ విలేజి సిరిసేడు క్లస్టర్ పరిధిలో ఏ ఈ ఓ మమత పాతర్ల పెళ్లి సిరిసేడు భోగంపాడు మర్రివానిపల్లి గ్రామాలు అదనంగా ఇల్లందకుంట రెవెన్యూ విలేజిని చూడవలసిందిగా చెప్పడం జరిగిందని తెలిపారు మండలంలో కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తులను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈఓల)కు రైతు భరోసా దరఖాస్తు ఫారం ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ పాసు పుస్తకం జిరాక్స్ కాపీలను ఆయా రైతు వేదికల్లో ఈ నెల 30లోగా ఇచ్చి నమోదు చేసుకోవాలని తెలిపారు మండల కేంద్రానికి చెందిన క్లస్టర్లు వ్యవసాయ విస్తరణ అధికారి లేకపోవడం సోచించదగ్గ విషయమని ప్రజలు అనుకుంటున్నారు ప్రతి విషయాన్ని మండల కేంద్రంలో గల అధికారులతో మాట్లాడడం జరుగుతుందని కానీ ఇల్లందకుంట క్లస్టర్ పరిధిలో ఏ ఈ ఓ లేకపోవడం చాలా సోచించద విషయమని వెంటనే ఉన్నతాధికారులు చర్య తీసుకుని మండల కేంద్రానికి వ్యవసాయ విస్తరణ అధికారులు అలాట్మెంట్ చేసి ప్రజల మనలను పొందాలని ప్రజలు కోరుతున్నారు