వర్షానికి రైతుల పంట నష్టం – తీరని లోటు
కామారెడ్డి, సెప్టెంబర్ 1 (ప్రశ్న ఆయుధం):
జిల్లాలో కురుస్తున్న వరుస వర్షాలతో పలు గ్రామాలు నీటమునిగాయి. చెరువుల కట్టలు తెగిపోవడంతో రహదారులు దెబ్బతిన్నాయి. అనేక కుటుంబాలు ఇళ్లు కోల్పోయాయి. రైతుల పంటలు విపరీతంగా నష్టపోయాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎల్లారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి కుచులకంటి శంకర్ —
“రైతులు అకాల వర్షాల వలన దెబ్బతింటున్నారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకంను తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల రైతులు కష్టాల్లో కూరుకుపోతున్నారు. వెంటనే ఫసల్ బీమా అమలు చేయాలి.
నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ₹50,000 పరిహారం ఇవ్వాలి. తక్షణ సహాయంగా ఎకరాకు ₹30,000 చొప్పున అందించాలి. వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయిన వారికి ‘ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేయాలి” అని డిమాండ్ చేశారు.