ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట చౌరస్తా వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతామని బెంగతో రైతు రామ్ రెడ్డి మృతి చెందారని, రామ్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంగారెడ్డి కెనాల్ నిర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.