గాంధారి మండల కేంద్రంలో రైతుల ధర్నా

గాంధారి మండల కేంద్రంలో రైతుల మాహా ధర్నా

 

*ప్రశ్న ఆయుధం న్యూస్ 30 సెప్టెంబర్ కామారెడ్డి జిల్లా*

 

 గాంధారి మండల కేంద్రంలో రైతులు మహా ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.రైతుల మహా ధర్నాకు మద్దతిస్తూ పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ 

 మాట్లాడుతూ ఎన్నికల్లో బూటకపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.

 అర్హులైన రైతులందరికీ వెంటనే బేశరతుగా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

 హైడ్రా పేరుతో డ్రామాలు వేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకోం అన్నారు.

 ఉద్యమాలకు పురిటి గడ్డ గాంధారి మండలం అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జిల్లా & రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామన్నారు.

వరి పంటకు క్వింటాలుకు 500/- బోనస్ ఇస్తానని మోసం చేసి ఇప్పుడు కేవలం సన్న వరి కి మాత్రమే ఇస్తననడం సరికాదన్నారు.

 సీఎం రేవంత్ రెడ్డి ఖబర్డార్ రైతులకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ మహా ధర్నాలో గాంధారి టిఆర్ఎస్ కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now