*ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో*
*15 రోజులు గడుస్తున్న పట్టించుకునే నాధుడే లేడు రైతులు*
*అధికారుల జవాబుదారితనం లేదు రాజకీయ పలుకుబడి ఉంటే వెంటనే కొనుగోలు*
*కనీసం మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు లేదు*
*వర్షం భయంతో అన్నదాతలు ఆవేదన*
*అధికారులు దిగొచ్చేంత వరకు ఆందోళన విరమించం_ రైతులు*
*తారం పేరుతో నాలుగు నుండి ఐదు కేజీలు తీయడం ఆపివేయాలి*
మధిర పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవాలని సిపిఎం పార్టీ బృందం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పై సమస్యలను గుర్తించిన సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి *మడుపల్లి గోపాలరావు* రైతులు నిర్వహిస్తున్న రాస్తారోకోను ఉద్దేశించి మాట్లాడుతూ రైతాంగం ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే అధికారులు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా మార్కెట్లో తగిన వసతులు ఏర్పాటు చేసి తారం తీయడం వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు రాజకీయ యువతులు లేకుండా రైతులందరిని సమానంగా పంట కొనుగోలు చేయాలని అన్నారు రైతులకు అండగా సిపిఎం పార్టీ ఉంటుందని రైతులకు భరోసా కల్పించారు. పోలీసుల జోక్యంతో ఉన్నత అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన హామీ మేరకు రాస్తారోకోను విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు మందా సైదులు పట్టణ కార్యదర్శి పడకంటి మురళి డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు పాపినేని రామ నరసయ్య తేలపోలు రాధాకృష్ణ ఊట్ల శంకర్రావు పుచ్చకాయల కిషోర్ రైతులు తదితరులు పాల్గొన్నారు