*రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ కు తీసుకువచ్చి అధిక ధరలు పొందాలి*
*మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న*
*జమ్మికుంట ఫిబ్రవరి 3 ప్రశ్న ఆయుధం*
పత్తిని పండించిన రైతులు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి తగిన ధర పొందాలని రైతులను నూతనంగా ఎన్నికైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం కోరారు సోమవారం రోజున జమ్మికుంట మార్కెట్ పరిదిలోని రైతులు పండించిన పత్తిని నాణ్యతా ప్రమాణాలతో నేరుగా మార్కెట్ కు తీసుకువచ్చి తగిన ధరలు పొందాలని మార్కెట్ చైర్ పర్సన్ తెలిపారు రైతులు దళారులను నమ్మి మోసపోకుండా మార్కెట్ లో తమ ఉత్పత్తులను అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధరలు పొందాలని
సీసీఐ వారికి అమ్ముకొనే రైతులు మీ వెంట ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, తీసుకొని వచ్చి జమ్మికుంట పరిధిలో వున్నా సీసీఐ కి కేటాయించిన (08) జిన్నింగ్ మిల్లు లో అమ్ముకోవాలని తెలిపారు.
రైతులకు మార్కెట్ యార్డ్ లో ఏ ధర పలికిందో మిల్లుల వద్ద కూడ అదే ధరలు ఉండేలా చూడాలని తేడా వచ్చినచో మా ద్రుష్టికి తీసుకొని వస్తే మిల్లుల పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు రైతులు మీరు పండించిన పత్తిని నీళ్లు చల్లకుండా తేమ శాతం తక్కువ వచ్చేల తీసుకొని వస్తే మంచి ధర లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, డైరెక్టర్ లు, కార్యదర్శి మల్లేశం మార్కెట్ సిబ్బంది, ఆడ్తిదారులు ఖరీదు దారులు, గుమస్తాలు, హమాలి, దాడువై కార్మికులు తదితరులు పాల్గొన్నారు.