బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటన.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇస్తున్న దానిని పెంచాలని భారతీయ జనతా పార్టీ కోరుతున్నది.
దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్న విషయం గ్రహించాలి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏటాకు రైతులకు అందిస్తున్న సాయాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది సరైనది కాదు. ప్రజలందరు గమనించగలరని విన్నవిస్తున్నాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలో రైతులకు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి, పంటలపై అధిక లాభాలు పొందే అవకాశం కలిగించేలా, ఆర్థిక సాయం అందించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు అందే ఆర్థిక సాయాన్ని పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటివరకు రూ. 3.80లక్ష కోట్లకు పైగా ఫసల్ బీమో యోజన నిధులను విడుదల చేసి రైతులకు బాసటగా నిలిచింది. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు మూడు విడతల్లో రైతులకు రూ.6వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది.
తాజాగా నూతన సంవత్సరంలో రైతుల మనోధైర్యాన్ని పెంపొందించేలా, రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిన ‘ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన’ కు సంబంధించి నిధుల పెంపుదల అత్యంత పెద్ద నిర్ణయం తీసుకుంది. రైతు సంక్షేమానికి మద్దతు పలికేలా DAP ఎరువులపై రాయితీ పెంచింది. ఇప్పుడు రైతులు 1350 రూపాయలకే 50 కేజీల DAP ఎరువులు కొనుగోలు చేయవచ్చు. రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 3,850 కోట్ల వరకు ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించింది. ఇది రైతుల పెట్టుబడులను తగ్గించి, వారి వ్యవసాయ ఉత్పత్తులను పెంచే అవకాశం కల్పిస్తుంది. రైతుల ఆదాయం పెరుగుదల, ఎరువుల ధరలు తగ్గడంతో పాటు వ్యవసాయంలో అధిక ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అనేక రైతుల కష్టాలు తగ్గించే మార్గాన్ని చూపిస్తుంది.
దేశ వ్యాప్తంగా రైతులను ఆదుకునేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ ప్రకటనలను రైతులు నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే అధికారికంగా విడుదల చేయడం జరుగుతుందని విన్నవిస్తున్నాం