రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్25 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి, మద్దతు ధర పొందాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.
పాల్వంచ మండలం పరిధిలోని సంగం గ్రామంలో పాల్వంచ సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్ చైర్మన్,రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు తో కలిసి కూనంనేని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కూనoనేని మాట్లాడుతూ రైతులు దళారుల మాయ మాటలు నమ్మి, వారికి ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దాన్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యంపై క్వింటాలుకు రూపాయలు 5 వందలు బోనస్ ఇస్తున్నదని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూనంనేని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, డి సి ఓ ఖుర్షిద్, ఎమ్మార్వో వివేక్, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, ఇంచార్జి ఎంపీడీవో నారాయణ, వ్యవసాయ శాఖాధికారి శంబో శంకర్, పి ఆర్ డి డి రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్లు బుడగం రామ మోహనరావు, కనగాల నారాయణ, చౌగాని పాపారావు, మైనేని వెంకటేశ్వరరావు, భూక్యా కిషన్, సిపిఐ నాయకులు ముత్యాల విశ్వనాథం, పూర్ణచందర్ రావు, కాంగ్రెస్ నాయకులు నూకల రంగారావు, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment