*రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి*
*మండల తహసిల్దార్ నల్ల వెంకట్ రెడ్డి*
*జమ్మికుంట జూన్ 9 ప్రశ్న ఆయుధం*
రైతుల భూ సమస్యల పరిష్కారానికే అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట మండల తాహసిల్దార్ నల్ల వెంకటరెడ్డి అన్నారు. సోమవారం జమ్మికుంట మండలంలోని వావిలాల నగురం నాగారం పాపక్కపల్లి గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు అనంతరం తహసిల్దార్ నల్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం రూపొందించారని దీని ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామంలో రైతు సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను దరఖాస్తు తీసుకొని పరిష్కరిస్తామని తహసీల్దార్ నల్ల వెంకట్ రెడ్డి తెలిపారు వావిలాల నగురం నాగారం పాపక్కపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు గ్రామంలోని రైతులు 161 దరఖాస్తులను రెవెన్యూ అధికారులకు అందించారని తెలిపారు రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని దీనిపై ప్రజలకు గతంలోనే అవగాహన కల్పించడం జరిగిందని ఇప్పుడు ప్రతి రెవెన్యూ గ్రామంలో జరగబోయే భూభారతి సదస్సుకు ముందు రోజే మా సిబ్బంది ఆ గ్రామంలో ఉన్న రైతులకు అవగాహన కల్పించి వారికి అప్లికేషన్లు అందించడం జరుగుతుందని రైతు సమస్యలను అప్లికేషన్ ద్వారా సదస్సులో అందిస్తే సరిపోతుందని తహసిల్దార్ తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సదస్సులు నిర్వహించడం రైతులు సహకరించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం తహసిల్దార్ వెంకట్ రెడ్డి డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గడ్డం శంకర్, సత్యనారాయణ, ఎంపిఎస్ఓ రెవిన్యూ సిబ్బంది సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.