రైతులు కూరగాయల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలి: ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి

సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): రైతులు కూరగాయల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం గుమ్మడిదల రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో క్లస్టర్ లెవెల్ కూరగాయల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు కూరగాయల సాగులో చీడపీడలు, తెగుళ్ల నివారణకు సమయానుకూలంగా జాగ్రత్తలు తీసుకోవాలని, సహజసిద్ధమైన విధానాలతో సాగు చేయడం వల్ల నాణ్యత కలిగిన ఉత్పత్తి లభిస్తుందని తెలిపారు. అనంతరం జిల్లా ఉద్యాన శాఖ అధికారి సోమేశ్వర రావు మాట్లాడుతూ.. పంటల ఏర్పాటులో నేల సిద్ధీకరణ, విత్తనాల ఎంపిక, కీటకనాశకాలు వాడే విధానం, నీటి నిర్వహణ పద్ధతులపై వివరించారు. ఉద్యాన శాఖ తరఫున ఇచ్చే సబ్సిడీలు, పథకాల వివరాలు రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు డా.చంద్ర మౌళి, బి.సురేష్, అగ్రోనోమిస్ట్ కోరమాండల్ పి.ప్రసాద్, పీఏసీఎస్ ఛైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, రైతు సంఘం ఛైర్మన్ సదానందరెడ్డి, ఉద్యాన శాఖ అధికారి జి.అనూష రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment