యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు..!!
ఆగస్టు 12: నాట్లు వేసి కలుపు తీసే సమయం కాబట్టి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు..
మంగళవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా దురదృష్టకరమైన విషయం యూరియా కొరతను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి వీడియోలే నిదర్శనo
రైతులు వేసిన పంటలకు సరిపడా ఎరువులు దొరకడం లేదన్నారు ఎరువుల కోసం వ్యవసాయ పనులు వదులుకొని దుకాణాల వెంట తిరగాల్సి వస్తోందన్నారు. దుకాణాదారులు రైతులకు ఒకటి రెండు బస్తాలకంటే ఎక్కువ ఇవ్వడం లేదని, ఇచ్చే యూరియా బస్తాలకు రైతుల ఆధార్ కార్డులు పాస్బుక్ జిరాక్స్ తీసుకొని క్యూ నిలబడితేనే ఒక్కొక్కరికి రెండు చొప్పున ఇవ్వడం జరిగింది
తొగుట లో యూరియా కోసం రైతులు పడిగాపులు..
రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అరకొరగా అందుబాటులో ఉన్న యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు నిరీక్షిస్తున్నారు. రోజంతా యూరియా కోసం క్యూలో ఉన్నా రైతులకు పలు ఆంక్షలు పెడుతూ రెండు బస్తాలు అందజేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ యూరియా కొరత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సరిపడా యూరియా దొరకడం లేదన్నారు. యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలోనే రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేవని గుర్తుచేశారు.