ముఖ్యమంత్రి మంత్రులకు పాలాభిషేకం చేసిన రైతులు

*ముఖ్యమంత్రి మంత్రులకు పాలాభిషేకం చేసిన రైతులు*

*జమ్మికుంట జనవరి 28 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు పథకాలలో భాగంగా రైతు భరోసా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడంతో భోగంపాడు గ్రామంలో రైతులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ స్టేట్ డైరెక్టర్ ఎక్కెటి సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజులలో అండగా ఉండాలని కోరారు ప్రజాలంతా ముక్తకంఠంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now