ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
శివ్వంపేట మండలం రత్నాపూర్ లో భూసేకరణ చేసేందుకు రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేను రైతులు అడ్డుకున్నారు. గుంట భూమి లేకుండా భూములను తీసుకుంటే ఆత్మహత్య దిక్కని మహిళా రైతులు కంటతడి పెట్టారు. ఎకరా భూమి నష్టపరిహారానికి 10 గుంటల భూమి కూడా రావడంలేదని పేర్కొన్నారు. తహశీల్దార్ శ్రీనివాస్ చారి, ఆర్ కిషన్ అక్కడకు చేరుకొని రైతుల నుంచి వినతులు స్వీకరించారు.