Site icon PRASHNA AYUDHAM

నష్టపోయిన రైతులు ఆదుకోవాలి..

IMG 20240723 WA10231

తీవ్ర వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలి
రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి 23
గిరిజనులతో కలిసి నాటు వేసిన కొత్వాల శ్రీనివాస్.
గత పది రోజులుగా తీవ్ర వర్షాలతో రైతులు వేసుకున్న పంటలు కొట్టుకుపోయాయని, అధికారులు నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, రైతాంగాన్ని ఆదుకోవాలని ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాల్వంచ మండలం పరిధిలో మంగళవారం కిన్నెరసాని పరివాహక ప్రాంతాలైన రంగాపురం, నాగారం కాలనీలలో రైతులు వేసుకున్న వరి, పత్తి పంటలు కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతం రైతులు, ప్రజాప్రతినిధులు కొత్వాల దృష్టికి తీసుకువెళ్ళగా స్పందించిన ఆయన వ్యవసాయ శాఖా అధికారులతో కలిసి పర్యటించారు. కొట్టుకుపోయిన వరి, పత్తి పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కొత్వాల* మాట్లాడుతూ వ్యవసాయ శాఖా, రెవెన్యూ శాఖల అధికారులు మండలంలో పర్యటించి, పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి కట్టుబడి వున్నదని, అధికారులు నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, నివేదికలు పంపడంలో అలసత్వం లేకుండా, వెంటనే ప్రభుత్వానికి నివేదికలు పంపాలని కొత్వాల కోరారు.
వరి నాటు కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల నాగారం కాలనీలో వరి నాట్లు వేస్తున్నగిరిజన మహిళలతో కలిసి కొత్వాల వరి నాటు వేశారు.

కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖా అధికారి పిశంభో శంకర్, మాజీ జెడ్పిటిసి సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, మండల అధ్యక్షులు కోండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు బాదర్ల జోషి, పాబోలు నాగేశ్వరరావు, గండు భరత్, అజ్మీరా రమేష్, భూక్యా ప్రసాద్, జి. శంకర్, బానోత్ వీరన్న, తేజావత్ భద్రు, పెండ్లి రామిరెడ్డి, తేజావత్ సురేష్, బానోత్ మాంచ, బానోత్ బీముడు, జగన్నాధపురం మాజీ ఉప సర్పంచ్ పాటి వీరభద్రం, G వీరు, బి.సతీష్, బి.కృష్ణ, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version