ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన రెైతులు
అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా సన్న వడ్లకి క్వింటల్ కి 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాలోకి జమ చేసిన సందర్బంగా శుక్రవారం కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, టీపీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణా రావు చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇచ్చిందని, ఈ పథకంతో ఎకరా సన్న వడ్లకి రైతులకి 15 వేల రూపాయల వరకు లబ్ది చేకూరుతుందని హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు నక్క సుధీర్, పాక్స్ చైర్మన్ చింతకుంట సాయిరెడ్డి, పాక్స్ డైరెక్టర్ గడ్డం హన్మక్క, మాజీ కేడీసీసీ డైరెక్టర్ నగునూరి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు ముక్కెర రాజేష్, గోపిడి నారాయణ, కుర్మ తిరుపతి, తొట్ల మహేష్, సందరగిరి మధు, బింగిసరం శివ, రైతులు పన్నాల లింగారెడ్డి, ఇప్ప స్వామి, కాలగిరి గంగ రెడ్డి, పెద్దిరెడ్డి రాజారెడ్డి, నడిపన్న తదితరులు పాల్గొన్నారు.