*అంబాల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం*
•
• పదిమంది పైగా తీవ్ర గాయాలు
కమలాపూర్ (జనవరి27)
కమలాపూర్ మండల పరధిలోని అంబాల గూడూరు గ్రామాల మార్గం మధ్య రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . మునిపల్లె గ్రామానికి చెందిన 20 మంది కూలి పని కోసం వంగపల్లి గ్రామానికి వెళ్లి పని ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలోAP 24 TA 9122 టాటా ట్రాలీ గూడ్స్ బండి లో కూలీలను తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు AP 29 Z 1508 గల ఆర్టీసీ బస్సును ఢీకొనడం జరిగింది. ట్రాలీ డ్రైవరు ఎదురుగా వస్తున్న టూ వీలర్ బండిని తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇరవై మంది కూలీలు ఉండగా అందులో పది మందికి తీవ్ర గాయాలు కాగా వారిని అంబులెన్స్ లో ఎంజీఎం కు తరలించారు.