కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

*కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య*

తెలంగాణ : ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఓ తండ్రి బలవంతంగా ఉసురు తీసుకున్నాడు. వరంగల్‌(D) దుగ్గొండి(M) స్వామిరావుపల్లికి చెందిన కూచన రాజ్యలక్ష్మి-రవి దంపతులకు శిరీష, సాయికుమార్‌ సంతానం. కుమార్తెకు వివాహం చేయగా ఆరేళ్ల కిందట విద్యుత్ షాక్‌‌తో చనిపోయింది. ఈ దుఃఖంతో రాజ్యలక్ష్మి పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. కుమారుడు సాయికుమార్‌(23) ఈ నెల 16న రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయిన రవి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment