Headlines
-
అనంతపురంలో ఫాదర్ ఫెర్రర్ ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
-
ఉద్యోగులకు ఆటవిడుపు, ఆరోగ్యానికి మేలు చేసే టోర్నీ
-
మచ్చా రామలింగారెడ్డి కృషికి అభినందనలు
-
క్రీడల ద్వారా ఉద్యోగుల ఐకమత్యానికి ప్రోత్సాహం
-
ఆర్డిటి మైదానంలో ఐపిఎల్ తరహా టోర్నమెంట్
*క్రీడా స్ఫూర్తితో ఆడండి*
*మచ్చా రామలింగారెడ్డి కృషి అభినందనీయం*
*మంచో ఫెర్రర్ ప్రోగ్రాం డైరెక్టర్ ఆర్డిటి పిలుపు*
*శ్రీ ఫాదర్ ఫెర్రర్ ఉద్యోగస్తుల క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన మంచో ఫెర్రర్, మచ్చా రామలింగారెడ్డి, గురు ప్రసాద్
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అనంతపురం జిల్లాలో ఐపిఎల్ తరహాలో ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుందని ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ అన్నారు
ఏపీ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్, ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫాదర్ ఫెర్రర్ ఉద్యోగస్తుల క్రికెట్ టోర్నమెంట్ ఆనంతపురం నగరంలోని ఆర్డిటి స్టేడియం నందు జిల్లా స్థాయి ఫాదర్ ఫెర్రర్ ఉద్యోగస్తుల క్రికెట్ టోర్నమెంట్ 2024 ప్రారంభ సమావేశం ఆదివారం ఉదయం జరిగింది ఈ కార్యక్రమానికి మచ్చా రామలింగారెడ్డి అధ్యక్షులు వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ పాల్గొన్నారు ఆత్మీయ అతిథిగా సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ అధ్యక్షులు గురు ప్రసాద్ అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఇంచార్జ్ కార్యదర్శి భీమ్ లింగారెడ్డి జుడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్, విజయరాజు తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మంచో ఫెర్రర్ మాట్లాడుతూ ఉద్యోగులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని ఇటువంటి పోటీలు నిర్వహించడం ద్వారా ఉద్యోగులకు ఆటవిడుపుతోపాటు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు నిత్యం పని ఒత్తిడితో ఉన్నటువంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉండడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు
అనంతపురంలో ఇటువంటి క్రికెట్ మైదానం వస్తుందని ఎవరు ఊహించలేదని ఇప్పుడు దేశం మొత్తం అనంతపురం వైపు చూసేలా క్రికెట్ మైదానం తయారయిందని ఒకప్పుడు సాదాసీదాగా మైదానాన్ని తయారు చేశామని రోజురోజుకీ అన్ని విధాల అభివృద్ధి చేస్తూ దేశంలోని క్రికెటర్లందరూ ఇటీవలనే వచ్చి ఇక్కడ ఆడారని ఆర్డిటి మంచో ఫెర్రర్ అన్నారు
భవిష్యత్తు తరాలకు ఈ క్రికెట్ చేయడం ఉపయోగకరంగా ఉంటుందని అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఆర్డిటి పనిచేస్తుందని మంచో ఫెర్రర్ అన్నారు
జిల్లాలో గతంలో నుంచి క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ప్రతి ఏడాది టోర్నమెంట్ నిర్వహించిన మచ్చా రామలింగారెడ్డిని అభినందిస్తున్నానని క్రికెట్ ఏదో విధంగా జరగాలని మచ్చా కృషి చేస్తుంటారని ఇది ఒక మంచి ప్రయత్నమని వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు మంచో ఫెర్రర్ అన్నారు
మొదట సభ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది ఆయన పేరు మీద ఉద్యోగస్తులకు, జర్నలిస్టులకు క్రికెట్ టౌర్నమెంట్లు నిర్వహిస్తున్నామని అన్నారు
ఫాదర్ ఫెర్రర్ ఎంప్లాయిస్ టోర్నీలో టోర్నమెంట్ 20 ఉద్యోగస్తుల టీమ్లు పాల్గొంటున్నాయని సెలవు దినాల్లో మాత్రమే టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన మంచో ఫెర్రర్ కి కృతజ్ఞతలు తెలిపారు
గురు ప్రసాద్ అధ్యక్షులు బార్ అసోసియేషన్ మాట్లాడుతూ ఫాదర్ ఫెర్రర్ జిల్లాకు ఎనలేని సేవ చేశారని ఆయన పేరు మీద ఉద్యోగస్తులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని ఉద్యోగులందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అందరూ ఐకమత్యం కోసం ఇటువంటి పోటీలు దోహదపడతాయని అన్నారు
వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచో ఫెర్రర్ ను ఘనంగా సన్మానించారు అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయరాజు ఇతర సభ్యులు మోమేంటో ను అందజేశారు
ప్రారంభ సమావేశం అనంతరం మంచో ఫెర్రర్ బ్యాటింగ్ చేసి లాయర్ గురు ప్రసాద్ బౌలింగ్ చేసి టోర్నమెంట్ ని లాంచనంగా ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో జయ రామిరెడ్డి, బి.సి.అశోక్ రెడ్డి, బాలాజీ నాయక్, షాహిర్, రవి నాయక్, గంగాధర్, మురళి, మారుతి, గంగాధర్, మహీంద్రా ఉద్యోగస్తుల క్రికెట్ జట్లు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ఏపీ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ అనంతపురం*