నాన్నే ఓడ – జీవన నడకలో తండ్రి త్యాగగాథ..!
వరదల్లో కొట్టుకుపోయినా… గోడలపై మళ్లీ ఆశల ఇటుకలు కడుతున్న సంకల్పం..
కన్నీళ్లను విత్తనాలుగా నాటి, భవిష్యత్తు పంటలు పండించే తండ్రి త్యాగం..
ముంపు నీళ్లలోనూ వెలుగుదారి చూపే ఆత్మవిశ్వాసం..
కూలిపోయిన కలల మధ్య కొత్తకోట కట్టే కష్టజీవి మన నాన్న..
కలల రాజ్యానికి పయనానికి మార్గదర్శి అయిన తండ్రి శక్తి..
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 3కామారెడ్డి:
తుపానులు చెరువుగట్టును తుడిచేసినా… గాలి వానలు కలల గుడిసెలను చీల్చినా… ఆశల దీపం ఆరిపోనివ్వడు తండ్రి. కన్నీళ్లు గడపలు తాకినా, గోడలు విన్నా – తన బలహీనతను బయట పెట్టని ధైర్యవంతుడు.
ముంపు నీటిలో దీపం వెలిగించి రేపటి దారిని చూపించే ఆత్మవిశ్వాసం నాన్నది.
చెదిరిపోయిన గోడల మధ్య విశ్వాసం ఇటుకలతో కొత్తకోట కట్టే కష్టజీవి తండ్రే.
పంటలు వరదలో కొట్టుకుపోయినా, మళ్లీ ఆశల విత్తనాలు నాటి కొత్త పంటలు పండించే ధైర్యం ఆయనదే.
తండ్రి కలలలో మన భవిష్యత్తు కూర్చబెట్టి, మన కలల రాజ్యానికి దారితీసే ఓడ తండ్రే.
జీవితం అనే సముద్రంలో, కుటుంబాన్ని సురక్షితంగా తీరానికి చేర్చే నడిపేవాడు… నాన్నే.