సొసైటి అధ్యక్ష,కార్యదర్శులకు సన్మానం

సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

ప్రశ్న ఆయుధం 04 జూలై ( బాన్సువాడ ప్రతినిధి )

చిన్న కొడప్ గల్ సొసైటి అధ్యక్ష కార్యదర్శులు జార నాగిరెడ్డి, హన్మండ్లు కు పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామస్థులు శుక్రవారం సన్మానం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ… దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో చిన్న కొడప్ గల్ సొసైటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో

ప్రథమ స్థానంలో నిలిచి అవార్డ్ ను అందుకుందని తెలిపారు.ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానం సాధించినందుకు గాను అధ్యక్ష,కార్యదర్శులకు సన్మానం చేశామని తెలిపారు.అధ్యక్ష కార్యదర్శులు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు.రుణగ్రహీతలకు అవగాహన కల్పించి సమయానికి అప్పులు చెల్లించే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు.రైతులకు సకాలంలో పంటరుణాలు,ఎరువులు ,విత్తనాలు అందజేస్తున్నారని తెలిపారు.అలాగే సొసైటి అ ధ్వర్యంలో చిన్న కొడప్ గల్, పారడ్పల్లి,కాటేపల్లి,అల్లాపూర్,బుర్నాపూర్,ధర్మారం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి,జొన్నలు కొనుగోలు చేసి రైతులకు సహకారం అందిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం సహకార వారోత్సవాల్లో భాగంగా కాటేపల్లి గోదాం ఆవరణలో మొక్కలు నాటారు.కార్యక్రమంలో సింగిల్ విండో ఉపాధ్యక్షులు గంగాగౌడ్ , జీపి కార్యదర్శి ప్రదీప్,డైరెక్టర్లు పెంటయ్య,సాయిలు,రైతులు శంకర్,చాంద్పాషా,రమేష్, రవీందర్,,మొగులయ్య,సొసైటి సిబ్బంది రమేష్,సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment