*మహిళపై లాఠీ ఝులిపించిన పోలీసులు*
ప్రశ్న ఆయుధం 10ఆగష్టు
జగిత్యాల జిల్లా:
జగిత్యాల జిల్లా పరిధిలోని మెట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గొడవ పడ్డ ఈ దంపతులు శుక్రవారం మెట్‌పల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చారు.
పోలీసు స్టేషన్ ఎదుటనే భార్యాభర్తలిద్దరూ మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఏఎస్ఐ ఆంజనే యులు, ఓ హెడ్ కానిస్టే బుల్.. ఆ దంపతుల వద్దకు చేరుకున్నారు. ఇక వారిద్ద రిని విడిపించే క్రమంలో ఇద్దరు పోలీసులు అత్యు త్సాహం ప్రదర్శించారు.
ఏఎస్ఐ ఆంజనేయులు.. మహిళపై లాఠీ ఝులిపిం చారు. లాఠీతో కొడుతూ.. ఆమెను భయపెట్టిస్తూ పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి తరిమేశాడు
ఏఎస్ఐ. హెడ్ కానిస్టేబుల్ కూడా ఆమె పట్ల దురుసు గా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడి యాలో ఈరోజు పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది..
మహిళపై చేయి చేసుకున్న ఇద్దరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.