ఎరువులు, విత్తనాలు కొరత రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలీ

ఎరువులు, విత్తనాలు కొరత రాకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలీ

 

— జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 4

 

 

, కలితి విత్తనాలు అమ్మకం, ఫెర్టిలైజర్స్ అధిక ధరలకు అమ్మే షాపులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఎరువులు విత్తనాల, సరఫరా, కల్తీ విత్తనాలు, మందుల అక్రమ అమ్మకం జరుగకుండా తీసుకోవలసిన చర్యలపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వానాకాలం పంట సీజన్ లో రైతులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే జిల్లాకు 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, దాంతో పాటుగా మరో 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో అందుబాటులో ఇప్పటికే ఉందని అన్నారు. ఇప్పటికీ జిల్లాలో 25 వేల మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాలోని రైతులకు సొసైటీల ద్వారా అందించగా మరో 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉందని అయినా యూరియా కొరతతో రైతులకు ఇబ్బంది పడుతున్నారనే సమాచారం రైతులను గందరగోళానికి గురి చేస్తుందని వ్యవసాయ అధికారులు మండలాల వారీగా రైతులకు అవసరమైన మేర అందుబాటులో ఉన్న యూరియాను ఉపయోగించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. యూరియా అందుబాటులో ఉన్నదని సమాచారం రైతులకు అందించాలని అన్నారు. అలాగే గత సంవత్సరం ఈ సమయంలో ఎంత యూరియా రైతులకు అందించాము. ఇప్పుడు ఎంత అందించాము ఇంకా ఎంత అవసరం ఉంటదో నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు తరచు ఫెర్టిలైజర్స్ షాపులను తనిఖీ చేసి పురుగుల మందులు మరియు విత్తనాలను అధిక ధరలకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిర్దేశిత ధరకంటే అధిక ధరలకు విక్రయించే షాపులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.జిల్లాకు నిర్దేశించిన 2500 ఎకరాలలో పామాయిల్ తోటల పెంపకానికి వేగంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మరియు ఉద్యానవన అధికారులను ఆదేశించారు. సంవత్సరం పొడవునా పంట దిగుబడి వస్తూ రైతులకు అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆయిల్ ఫామ్ తోటల పెంపకం పై అవగాహన కల్పించి 5 ఎకరాలకు పైన భూమిని కలిగి ఉన్న రైతులను మోటివేట్ చేసి ప్రతి మండలానికి 200 ఎకరాలను టార్గెట్ గా నిర్దేశించుకుని ఆయిల్ ఫామ్ తోటల పెంపకం లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ విక్టర్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, ఏసీపి నర్సింహారెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, ఏడీఏలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment