పండగ తెల్లారి ముచ్చట

 *గ్రామీణo*

 

 

*పండుగ తెల్లారి .ముచ్చట*

__________________

 

ఊరు నుండి వెళ్ళిపోయే టైం 

అయింది,భాద బయటపడకుండ

నువ్వు బయల్దేరినవు…

తప్పదు ఊరిడిసిపెడుతాంటే

ఈ తిప్పల!నీకైనా నాకైనా!!

 

సరే నువ్వు నీ కుటుంబం 

బయేలెళ్లినవు

ఇంట్లకెళ్లి ,

వచ్చినవు,పట్నం వచ్చి

నీ పని నువ్వు చేస్కుంటావు..

కానీ సిన్నోడా,

మనువణ్ణి

మనువరాల్ని

ఎత్తుకుని ఆడిన నానమ్మ,

తినవే తల్లి అని

బుజ్జగిస్తూ

తన పిల్లలకు తినిపించినట్లు

కలిపి గోరు ముద్దలు కలిపి

గడ్డ పెరుగుతో

ముద్దుగా తినిపించిన అమ్మమ్మ,

 

నా బిడ్డ బిడ్డ,

నా కొడుకు బిడ్డ అని 

నా మనువడు,

 నా మనువరాలు అని 

తన xl బండి మీదనో,

 సైకిల్ మీదనో

తన భుజాల మీదనో ,

ఎక్కించుకుని తిరిగిన తాత,

 

ఈ రోజు నుండి …

 

పొలగాండ్లు ఇంట్ల లేక,

సప్పుడు, సందడి లేక

నిన్నటి దాకా సంబురపడ్డ 

ఆప్యాయత కూడిన గుండెలు

మనసున పట్టక…

మళ్ల మీరచ్చే వరకూ…

ఇంటి బయట బండి సప్పుడైన

కార్ సప్పుడైన…

నా కొడుకేమన్న వచ్చిండో,

బిడ్డెమన్నో వచ్చిందో,

ఉలిక్కిపడి ఎదురు సూత్తరని

నీకు తెల్వదా సిన్నోడా?

 

ఆలయిబలాయి తీసుకున్న

దోస్తులు,

నువ్వు ఇడిసి పెట్టి వచ్చిన

ఇల్లు,ఊరు,చెట్టు,గట్టు

నువ్వు వచ్చినట్లే లేదు బిడ్డా ,

అప్పుడేపోతన్నావా ?

అని అనుకుని దిగులుగా

మళ్ల నువ్వెప్పుడు వూళ్ళే అడుగు

పెడుతావా అని నీ రాక కోసం

ఎదురు చూస్తారని

నీకు చెప్పాల్నా సిన్నోడా?

 

పండగా ,పండుగా నువ్వు వస్తావు

బోలెడన్నీ తీపి జ్ఞాపకాలు ఇస్తావు

నువ్వెళ్లేప్పుడు

నా  దేహంలకెళ్లి, పానం తీసుకుని

పోయినంత పని చేస్తవూ

 

 

ఉన్నోళ్ల లెక్కనే కనపడుతం,

కానీ,

ఐనోళ్లతో ఉండలేము,

ఒక్కవూళ్లే ఉండలేం,

బయటకు భాద కనపడేట్లు 

ఏడ్వలేం!

 

నువైనా,నేనైనా 

చేయగలిగేది

ఒక్కటే 

దసర పండుగ,

దసర పండుగ 

వచ్చే యేడు

నువ్వు కొంచెం జప్పన

రాయే!!! అని కోరుకుండు తప్పు 

 

ఉద్యోగార్థం ఊరిడిసి ,

పల్లెనిడిసి,

తల్లినిడిసి,

బయల్దేరిన సాటి సోదరులకు

ఈ వ్యాసం అంకితం.

 

 

By— బాపు రావు పాటిల్ 

 

 

Join WhatsApp

Join Now