సొంత భూమి ఉన్న రైతులకు పండగే

సొంత భూమి ఉన్న రైతులకు పండగే.. ఇన్నాళ్లు ఇది తెలియక రూ.50 వేలు మిస్.. దరఖాస్తు చేసుకోండిలా..

ఉద్యాన పంటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తున్నాయి. నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా టమాట, గులాబీ సాగుకు రూ.1.12 కోట్ల వరకు సబ్సిడీ లభిస్తుంది. పండ్ల తోటల సాగుకు రూ.75 లక్షల వరకు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి కూడా రాయితీలు ఇస్తున్నారు. ఆయిల్ పామ్ సాగుకు ఉచితంగా మొక్కలు అందిస్తున్నారు. అంతే కాకుండా.. అర ఎకరం భూమిలో తీగజాతి కూరగాయలకు పందిరి వేసుకోవడానికి రూ.50 వేలు సబ్సిడీ కింద రైతులు అందుకోవచ్చు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

రక్షిత సాగు (నెట్ హౌస్, గ్రీన్ హౌస్) కింద.. 2,500 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో టమాటా, క్యాప్సికం, కీర, దోసకాయ లాంటి కూరగాయలు, లేదా గులాబీ, ఆర్కిడ్, అంథూరియం లాంటి పూల సాగుకు NHB ఏకంగా రూ.1.12 కోట్ల వరకు మంజూరు చేస్తోంది. ఇందులో సగానికి సగం, అంటే 50 శాతం సబ్సిడీగా వస్తుంది. ఈ డబ్బుతో నెట్ హౌస్‌లు, గ్రీన్ హౌస్‌లు, పక్షుల నుంచి రక్షణ కల్పించే నెట్స్ (యాంటీ-బర్డ్ నెట్స్), టన్నెల్స్ (సొరంగాలు), వడగళ్ల నుంచి కాపాడే నెట్స్ (హెయిల్ నెట్స్) లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

పండ్ల తోటల సాగుకు: ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ, నారింజ, మామిడి, సీతాఫలం, రేగు, అరటి, దానిమ్మ లాంటి పండ్ల తోటలు వేయడానికి రూ.75 లక్షల వరకు ఇస్తారు. ఇందులో 40 శాతం (రూ.30 లక్షలు) సబ్సిడీగా అందుతుంది. భూమిని చదును చేసుకోవడం, బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్), వ్యవసాయ పనులకు యంత్రాలు (యాంత్రీకరణ), నీటిపారుదల వసతులు, పంట ప్యాకింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వంటి వాటికి ఈ డబ్బును వాడుకోవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment