దమ్మపేట మండలం అంకంపాలెం పంచాయితి యర్రగుంపు గ్రామంలో బోనాల పండుగ ఉత్సవం గ్రామ పెద్దలు తాటి రాము, తాటి రామచంద్రరావు, వాడే భద్రం గారి ఆధ్వర్యంలోని నిర్వహించటం జరిగింది. మహిళలు బోనాలు ఎత్తుకొని ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి, ఈ సంవత్సరం వరుణుడు కరుణించి వర్షాలు మంచిగా పడాలని పాడి పంటలతో గ్రామ రైతులు అందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తాటి బాబురావు,తాటి వెంకటేష్,పద్దం వెంకటేష్, చిన్న రాజు, వెంకటేష్ తాటి రాములమ్మ, సుశీల, కుమారి, లక్ష్మీ చంద్రమ్మ,జయ,సీతామహాలక్ష్మి, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.