*వినాయకుని ఆశీస్సులతో ప్రజల మధ్య బిజ్జా శ్రీనివాస్ గౌడ్ ,కౌకుట్ల రాహుల్ రెడ్డి సందడి – నాగారం గణపతి మండపాల్లో పండుగ వాతావరణం*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 04
నాగారం మున్సిపాలిటీ పరిధి పలు కాలనీల్లో గణపతి మండపాలు భక్తిశ్రద్ధలతో కళకళలాడుతున్నాయి. ఈ భక్తి వాతావరణంలో నాగారం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్, బిజెపి యువజన నాయకుడు కౌకుట్ల రాహుల్ రెడ్డి పలు మండపాలను సందర్శించి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – “వినాయక చవితి పండుగను భక్తి, శ్రద్ధలతో జరుపుకోవడం సంతోషం. ఈ పండుగ ప్రతి ఇంటికి సుఖసంతోషాలు, శాంతి చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాం. గణేశుడి స్ఫూర్తితో మనమందరం కలిసిమెలిసి ముందుకు సాగాలి” అని అన్నారు.తరువాత మండపాల నిర్వాహకులను అభినందిస్తూ, పండుగ విజయవంతం చేయడంలో కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితం చేశారు.