ఫైర్ స్టేషన్ లో శిశు మందిర్ విద్యార్ధుల క్షేత్రస్థాయి పర్యటన

ఫైర్ స్టేషన్ లో శిశు మందిర్ విద్యార్ధుల క్షేత్రస్థాయి పర్యటన

క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కోరుట్ల శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థిని విద్యార్థులు శనివారం మెట్టుపల్లి ఫైర్ స్టేషన్ ను సందర్శించారు. విద్యార్థులు మొదటగా ఫైర్ స్టేషన్ అధికార యంత్రాంగాన్ని కలిసి ఫైర్ ఇంజన్ వాహనం ప్రత్యేకతను, వారి విధులను అత్యవసర పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకున్నారు. మంటలను ఆర్పడానికి ఉపయోగించే పరికరాలను ఎలా వాడాలి, ధైర్యంతో ఎలా పోరాడాలి అనే విషయాల పైన అధికారులు విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ భూములు, మామిడి తోటలలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, గృహాలలో జరిగే షార్ట్ సర్క్యూట్ జరిగే అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టే తక్షణ చర్యలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు అన్నిటిని సందర్శించిన తర్వాత వారికి వచ్చిన సందేహాలను అన్నింటికీ ఫైర్ సేఫ్టీ అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఫైర్ స్టేషన్ ను సందర్శించడం వల్ల తమకు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయని, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా వెంటనే సహాయక చర్యలకు సిద్ధంగా ఉండడానికి ఫైర్ సేఫ్టీ అధికారుల సలహాలు, అత్యవసర పరిస్థితులలో ఫైర్ ఎక్సటింగిషర్ ను ఏవిధంగా వాడాలో, వాటిని ఎలా వినియోగించాలి ప్రాక్టికల్ గా చూపించడం నిజంగా ఒక గొప్ప అనుభూతి అని విద్యార్థులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపు వెంకటేష్, అధ్యాపక బృందం జగన్, మహేష్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment